- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జ్యోతి మల్హోత్రాకు బిగ్ షాక్..ఇక ముందుంది ముసళ్ల పండగ !
పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా ఊహించని షాక్ తగిలింది. జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ప

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా ఊహించని షాక్ తగిలింది. జ్యోతి మల్హోత్రాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. పాకిస్థాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా కేసుపై ఇవాళ హర్యానా కోర్టు విచారణ జరిపింది. ఈ తరుణంలోనే ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు. అంతకు ముందు నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న జ్యోతికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
ఇది ఇలా ఉండగా జ్యోతి మల్హోత్రా కేసులో తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పాకిస్తాన్ వెళ్లినప్పుడు ఆమెకు.. పాకిస్తాన్ ప్రభుత్వం రాచ మర్యాదలు చేసింది. ఆరుగురు గన్ మెన్స్ తో కూడిన సెక్యూరిటీ కూడా.. ఇచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఏకే 47 రైఫిల్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కూడా కల్పించారు. అయితే దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ గా మారింది. స్పానిష్ యూట్యూబర్ క్యాప్చర్ చేసిన వీడియోలో.. పాకిస్తాన్ ఇచ్చిన భద్రత ఫుటేజ్ లు బయటకు వచ్చాయి.






