పదవీ నుంచి దిగిపోనున్న.. జపాన్ ప్రధాని 'ఫుమియో కిషిద'

by Geesa Chandu |   (  Updated:2024-08-14 09:42:35  IST  )

సెప్టెంబర్ లో జరిగే లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేయడం లేదని.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించారు.

పదవీ నుంచి దిగిపోనున్న.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద
X

దిశ, వెబ్ డెస్క్: సెప్టెంబర్ లో జరిగే లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో తానూ పోటీ చేయడం లేదని.. జపాన్ ప్రధాని ఫుమియో కిషిద ప్రకటించారు. ఎల్డీపీ మారుతోందని చూపించడానికి ముఖ్యమైన తొలి అడుగు.. నేను పోటీ నుంచి పక్కకు తప్పుకోవడమే అని కిషిద తెలిపారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ పార్టీ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. అయితే రాజకీయ కుంభకోణాలు మరియు జీవన వ్యయాలపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగింది. ఈ సందర్భంలో జపాన్ ప్రధాని కిషిద పలు వ్యాఖ్యలు చేశారు. "ప్రజా విశ్వాసం లేకుండా రాజకీయాలు పనిచేయవు. రాజకీయ సంస్కరణలు ముందుకు తీసుకురావాలనే ధృడ సంకల్పంతో తాను ప్రజల గురించి ఆలోచించి ఈ భారీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కిషిద పేర్కొన్నారు. ఉదారవాద ప్రజాస్వామ్య పార్టీగా తిరిగి ఎన్నిక చేయకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించాను" అని విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు.

Next Story