Masood Azhar: మసూద్ అజర్ సోద‌రుడు మృతి ?

by velandi.Saikiran |

జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది.

Masood Azhar: మసూద్ అజర్ సోద‌రుడు మృతి ?
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ ( Masood Azhar) సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ మృతి చెందినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లోనే మార్చి 30వ తేదీన మహమ్మద్ తాహిర్ అన్వర్ ( Muhammad Tahir Anwar ) మరణించాడని నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మహమ్మద్ తాహిర్ ఎలా చనిపోయాడు అనే దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు.

అనారోగ్యం కారణంగా మరణించాడా ? లేదా ఏదైనా దాడి జరిగిందా ? అనే విషయం పైన పాకిస్తాన్ ఐఎస్ఐ సంస్థ క్లారిటీ ఇవ్వలేదు. మొత్తానికి ఈ మరణ వార్త మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. కాగా జైష్-ఎ-మహ్మద్ సంస్థలో అత్యంత కీలక పాత్ర పోషించాడు తాహిర్ అన్వర్. జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాద సంస్థలో ఆయుధాల ట్రైనర్ గా తాహిర్ పనిచేసినట్లు చెబుతున్నారు. అంటే తమ సంస్థలో కొత్తగా చేరిన వాళ్లకు ఆయుధాలు ఎలా వాడాలి అనే దాని పైన ట్రైనింగ్ ఇచ్చేవాడట. అటు ల‌ష్క‌ర్ తోయిబా సంస్థ హ‌ఫీజ్ స‌యూద్ కు కూడా స‌న్నిహితుడు.

Next Story