పడవ బోల్తా.. 27 మంది మృతి

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-17 14:39:46  IST  )

ఇటలీలోని లాంపెడూసా సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రెండు పడవలు బోల్తా పడిన ఘటనలో దాదాపు 27 మంది చనిపోయారు. లిబియాలోని ట్రిపోలి నుంచి ఇటలీకి వెళ్తున్న సోమాలియా, ఈజిప్ట్‌కు చెందిన దాదాపు 97 మంది వలసదారులు రెండు పడవల్లో బయలుదేరారు.

పడవ బోల్తా.. 27 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటలీలోని లాంపెడూసా సమీపంలో విషాదం చోటు చేసుకుంది. రెండు పడవలు బోల్తా పడిన ఘటనలో దాదాపు 27 మంది చనిపోయారు. లిబియాలోని ట్రిపోలి నుంచి ఇటలీకి వెళ్తున్న సోమాలియా, ఈజిప్ట్‌కు చెందిన దాదాపు 97 మంది వలసదారులు రెండు పడవల్లో బయలుదేరారు. అయితే ఓ పడవలో నీరు చేరడంతో.. దాన్ని వదిలి అందరూ మరో పడవలోకి షిఫ్ట్ అయ్యారు. దీంతో అధిక బరువుతో పడవ బోల్తా పడింది. ఈ ఘటలో నవజాత శిశువుతోసహా 27 మంది మరణించగా.. 60 మందిని రక్షించి లాంపెడూసా వలసదారుల కేంద్రానికి తరలించారు. ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇద్దరు మినహా అందరూ ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తప్పిపోయిన వలసదారులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఐదు పడవలు, రెండు విమానాలు, హెలి కాప్టర్‌ సహాయంతో వెతుకుతున్నారు. ఇక 2025లో సెంట్రల్ మెడిటరేనియన్‌లో ఇప్పటికే 700 మందికిపైగా ఇమ్మిగ్రెంట్స్ చనిపోయారని రిపోర్ట్‌లో పేర్కొంది ఐక్యరాజ్య సమితి.

Next Story