Israel-Iran : ఇరాన్‌ శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. 12 మంది అధికారులు మృతి

by Malleboina Mahesh |   (  Updated:2025-06-15 04:53:42  IST  )

ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది. ఇరు దేశాలు వైమానిక దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

Israel-Iran : ఇరాన్‌ శాస్త్రవేత్తలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. 12 మంది అధికారులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది. ఇరు దేశాలు వైమానిక దాడుల (Air strikes)కు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. జూన్ 13న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) , మోసాద్ "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరుతో ఇరాన్‌లోని అణు సౌకర్యాలు, సైనిక స్థావరాలు, ఉన్నతాధికారుల నివాసాలపై దాడులు చేశాయి. ఈ దాడులు ఇరాన్ యొక్క అణు కార్యక్రమాన్ని అడ్డుకోవడం, దాని సైనిక సామర్థ్యాన్ని బలహీనపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ వంటి అణు సౌకర్యాలతో పాటు టెహ్రాన్, షిరాజ్, తాబ్రిజ్ వంటి నగరాల్లోని లక్ష్యాలపై 200కు పైగా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు 330కు పైగా మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో.. ఇరాన్ ఉన్నత సైనిక నాయకులు, అణు శాస్త్రవేత్తలు మృతి చెందారు.

మొత్తం 12 మంది కీలక వ్యక్తులు మృతి చెందినట్లు వార్తలు వస్తుండగా.. అందులో కానీ కనీసం తొమ్మిది మంది అణు శాస్త్రవేత్తలు (Nuclear scientists), ఉన్నత సైనిక అధికారులు మృతి చెందినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. మృతి చెందిన వారిలో ఇరాన్ సాయుధ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్, దేశంలో అత్యున్నత సైనిక అధికారి అయిన మొహమ్మద్ బాఘేరి, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్-ఇన్-చీఫ్ హోస్సేన్ సలామీ, ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ మాజీ అధిపతి, అణు శాస్త్రవేత్త ఫరీడౌన్ అబ్బాసీ, ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ అధ్యక్షుడు, సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మొహమ్మద్ మెహదీ తెహ్రాంచీ, షాహిద్ బెహెష్టీ యూనివర్సిటీకి చెందిన అణు శాస్త్రవేత్తలు అయిన అబ్దుల్‌హమీద్ మినౌచెహర్, అహ్మద్ రెజా జోల్ఫాఘరీ, అమీర్‌హోస్సేన్ ఫెఖీ, IRGC ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ అమీర్ అలీ హాజీజాదే, IRGC ఖతమ్ అల్-అన్బియా హెడ్‌క్వార్టర్స్ అధిపతి ఘోలామలీ రషీద్, ఇరాన్ సుప్రీం లీడర్‌కు సీనియర్ సలహాదారు అలీ షామ్‌ఖానీ లు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది.

Next Story