- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంచలన పరిణామం.. కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసిన ఇజ్రాయెల్–హమాస్
ఇజ్రాయెల్–హమాస్ మధ్య 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. గాజా పట్టణం నుండి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇజ్రాయెల్–హమాస్ మధ్య 2023 అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైంది. గాజా పట్టణం నుండి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై పెద్ద ఎత్తున దాడి చేశారు. సుమారు 3,000 మందికి పైగా హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సరిహద్దు దాటి దాడులు జరిపి, వందల మందిని హతమార్చి, అనేక మందిని బంధించారు. ఈ ఘటనకు ప్రతిగా ఇజ్రాయెల్ ప్రభుత్వం “యుద్ధ స్థితి” ప్రకటించి, గాజాపై భారీ వైమానిక దాడులు ప్రారంభించింది. తర్వాతి నెలల్లో ఇజ్రాయెల్ సైన్యం గాజా ప్రాంతంలో సైనిక దళాలను ప్రవేశపెట్టింది. గాజా నగరాలు, రఫా, ఖాన్ యూనిస్, నుసైరాత్ వంటి ప్రాంతాలు తీవ్ర బాంబు దాడులకు గురయ్యాయి. హమాస్ మిలిటెంట్లు భూగర్భ సొరంగాల ద్వారా ప్రతి దాడులు కొనసాగించారు. దీంతో ఇరు దేశాల మధ్య రెండు సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతూనే ఉంది.
అయితే ఇజ్రాయెల్–హమాస్ మధ్య శాంతి ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాధించారు. అనంతరం ఇజ్రాయెల్–హమాస్‌లు శాంతి ఒప్పందానికి అంగీకరించే విధంగా ట్రంప్ ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో శాంతి ఒప్పందం పై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో కొనసాగుతున్న ఈ చర్చల్లో “మొదటి దశ” ఒప్పందానికి ఇరు పక్షాలు అంగీకరించి.. సంతకాలు చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఈ ఒప్పందంలో బందీల విడుదల, గాజా ప్రాంతంలో ఇశ్రాయేలు సైనిక బలగాల వెనక్కి తగ్గింపు, మానవతా సహాయం అనుమతులు వంటి అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే హమాస్‌లో ఉన్న బందీలను తిరిగి ఇచ్చే ఒప్పందంపై సంతకం చేయడాన్ని IDF స్వాగతించింది.






