ఇజ్రాయెల్, US దాడుల్లో ఇరాన్ ఆయిల్ డిపోలు ధ్వంసం!

by velandi.Saikiran |

టెహరాన్ లోని మూడు ఆయిల్ డిపోలపై అమెరికా అలాగే ఇజ్రాయిల్ వరుసగా దాడులు జరిపాయి. ఈ

ఇజ్రాయెల్, US దాడుల్లో ఇరాన్ ఆయిల్ డిపోలు ధ్వంసం!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా ఈ మూడు దేశాల మధ్య వార్ భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం నేపథ్యంలో చాలామంది సైనికులు మరణించారు. ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ కు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇరాన్ ఆయిల్ డిపోలు మొత్తం ధ్వంసం అయ్యాయి.

టెహరాన్ లోని మూడు ఆయిల్ డిపోలపై అమెరికా అలాగే ఇజ్రాయిల్ వరుసగా దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలోని మూడు ఆయిల్ డిపోలు ధ్వంసం అయ్యాయి. డిపోలలో మంటలు చెలరేగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాకు వెళ్లే ఆయిల్ లో 15% ఇక్కడి నుంచే వెళ్తుందని, అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇది ఇరాన్ కు ఊహించని ఎదురు దెబ్బ అంటూ వ్యాఖ్యానించింది. ఇది ఇలా ఉండగా యుద్ధంలో తమకు సహకరించేందుకు చాలా దేశాలు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయిల్ ప్రధాని నెత న్యాహు . తమ విజయం ప్రపంచానికి అను ముప్పును తొలగిస్తుందని పేర్కొన్నారు.

Next Story