- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భీకర యుద్ధం..ట్రంప్‌నకు ఇరాన్ బిగ్ వార్నింగ్
త్వరలో మేము వాడబోయే ఆయుధాలు నువ్వు ఎప్పుడు కూడా చూసి ఉండబోవు.. అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్.

దిశ, వెబ్ న్యూస్: ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం జరుగుతుండగానే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఇప్పటి వరకు తమ వద్ద ఉన్న పాత ఆయుధాలను ఉపయోగించామని హెచ్చరించింది. మీరు తగ్గకపోతే త్వరలోనే మేము కొత్త ఆయుధాలను వినియోగిస్తామని ప్రకటన చేసింది.
త్వరలో మేము వాడబోయే ఆయుధాలు నువ్వు ఎప్పుడు కూడా చూసి ఉండబోవు.. అంటూ ట్రంప్‌ను ఉద్దేశించి హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్. ఇక వెస్ట్ ఏషియాలోని 14 యూఎస్ బేస్ లను టార్గెట్ చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటన చేసింది ఇరాన్. తమ దాడుల్లో వందలాది మంది అమెరికా సైనికులు కూడా మరణించినట్లు స్పష్టం చేసింది. కానీ దీనిపై ఇప్పటి వరకు అమెరికా సర్కార్ మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు చనిపోలేదు అన్నట్లుగానే వ్యవహరిస్తోంది అమెరికా. కానీ ఇరాన్ దెబ్బకు చాలామంది అమెరికా సైనికులు మరణించినట్లు జాతీయ మీడియాలు కథనాలు వస్తున్నాయి.






