బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రం మూసివేత

by Naga Rani Yarlagadda |

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత వీసాకేంద్రాన్ని భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.

బంగ్లాదేశ్‌లో భారత వీసా కేంద్రం మూసివేత
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత వీసాకేంద్రాన్ని భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. బంగ్లాదేశ్ లో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అసాంఘిక శక్తుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. జమునా ఫ్యూచర్ పార్క్ లో ఉన్న వీసా కేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మూసివేస్తున్నట్లు IVAC ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఈ క్రమంలో బుధవారానికి షెడ్యూల్ అయిన వీసా అప్లికేషన్లను మరో తేదీకి మార్చనున్నట్లు తెలిపింది. మరోవైపు ఇదే సమయంలో భారత విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ హై కమిషనర్ మహమ్మద్ రియాజ్ హమీదులలాకు సమన్లు జారీ చేసింది. బంగ్లా రాజధాని ఢాకాలో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తతలను సృష్టించేందుకు కొన్ని తీవ్రవాద శక్తులు కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భారత దౌత్య సిబ్బంది, కార్యాలయాలకు భద్రత కల్పించడం బంగ్లాలో ఉన్న మధ్యంతర ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేసింది.

Next Story