Iran, Israel tensions: ఇరాన్, ఇజ్రాయిల్ లో భారత పౌరులు జాగ్రత్తగా ఉండండి

by Shamantha N |

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణు స్థావరాలు, ఇరాన్ కీలక సైనికాధికారులే లక్ష్యంగా దాడులు జరపడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

Iran, Israel tensions: ఇరాన్, ఇజ్రాయిల్ లో భారత పౌరులు జాగ్రత్తగా ఉండండి
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ ఇరాన్ లోని అణు స్థావరాలు, ఇరాన్ కీలక సైనికాధికారులే లక్ష్యంగా దాడులు జరపడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. రెండు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యనించింది. దౌత్య మార్గాల్లో సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

భారత పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లండి

రెండు దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు సంప్రదింపులు జరుపుతున్నాయని ఈ ప్రాంతంలోని భారతీయ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, సురక్షితంగా ఉండాలని స్థానిక భద్రతా సలహాలను పాటించాలని ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయిల్ దాడి చేస్తుందని తనకు ముందే తెలుసని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇజ్రాయిల్ ఇరాన్ లోని బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను మోహరించే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఉన్నత స్థాయి సైనికాధికారితో పాటు చాలా మంది ఆర్మీకి చెందిన ఆఫీసర్లు మరణించారు.ఈ దాడి తర్వాత ఇరాన్, ఇజ్రాయిల్ పై దాదాపు 100 డ్రోన్లతో దాడికి తెగబడిందని వాటిని తిప్పికొట్టామని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి జనరల్ ఎఫ్ డెఫ్రిన్ ప్రకటించారు.

Next Story