- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakistan Blames India: ఆత్మాహుతి దాడిపై పాక్ ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్
పాకిస్థాన్ సైనికుల వాహనమే లక్ష్యంగా (Suicide attack) ఆత్మాహుతి దాడి కలకలం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాకిస్థాన్ (Pakistan Army) సైనికుల వాహనమే లక్ష్యంగా (Suicide attack) ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. శనివారం జరిగిన ఈ ఘటనలో 13 మంది సైనికులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కారు బాంబు దాడి వెనుక భారత్ హస్తం ఉందని పాకిస్తాన్ సైన్యం ఆరోపణలు చేసింది. దీనిపై భారత్ స్పందించింది. పాక్ సైన్యం చేసిన ఆరోపణలు భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆదివారం భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణదీర్ జైశ్వాల్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. జూన్ 28న వజీరిస్థాన్ జిల్లాలోని ఖైబర్ ఫంక్తువాలో మిలిటరీ వెహికల్‌పై జరిగిన దాడికి భారత్‌ను బ్లేమ్ చేయడాన్ని పాకిస్తాన్ సైన్యం అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.
ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. కాగా, పాకిస్తాన్ సైనిక వాహనంపై శనివారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ పేలుడులో 13 మంది సైనికులు మరణించారు. మరో 10 మంది సైనిక సిబ్బంది, 19 మంది పౌరులు గాయపడ్డారని వజీరిస్థాన్ జిల్లాలోని స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ ప్రకటించుకుంది. గతేడాది బలూచ్ ఆర్మీ ట్రైన్ ను ఆపి దాడి చేయగా దాదాపు పదుల సంఖ్యలో ఆర్మీ జవాన్లు మరణించారు. అటు ఖైబర్ ఫంక్తువాలో తెహ్రీక్ తాలిబాన్ గ్రూపు, ఇటు బలూచ్ ఆర్మీ అంతర్గత దాడులతో పాకిస్థాన్ అతలాకుతలం అవుతోంది.






