మా తండ్రిని ఇక చూడలేమేమో.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఆవేదన

by Ajay Maddhiboyina |

మా తండ్రిని ఇకపై చూడలేము ఏమో అంటూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసీం, సులేమాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ..

మా తండ్రిని ఇక చూడలేమేమో.. ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఆవేదన
X

దిశ‌, వెబ్ డెస్క్: మా తండ్రిని ఇకపై చూడలేము ఏమో అంటూ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఖాసీం, సులేమాన్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ.. ఆయనతో మాట్లాడి నెల రోజులు అయిందని చెప్పారు. తమ తండ్రిని జైలులో గదిలో నిర్బంధించి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఆయన్ను రెండేళ్లకు పైగా గదిలో ఉంచారని మురుగు నీరు ఇస్తున్నారని అన్నారు. అంతే కాకుండా హెపటైటిస్ తో మరణిస్తున్న ఖైధీల మధ్యలో పెట్టారన్నారు. ఆయనను బటయకు తీసుకువచ్చేందుకు ఏ మార్గం కనిపించడంలేదన్నారు.

అయినా తమకు నమ్మకం ఉందని కానీ ప్రస్తుతం పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని వ్యాఖ్యానించారు. ఆయనను మళ్లీ ఎప్పటికీ చూడలేమేమోనని ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. రోజులో ఎక్కువ సమయం తమ తండ్రి నిర్భంధ గదిలోనే గుడుపుతున్నారని చెప్పారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులే ఇటీవల ప్రకటించారన్నారు. అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఆయన జైలు జీవితం ఉందని ఎమోషనల్ అయ్యారు. మరోవైపు ఇటీవల ఇమ్రాన్ ఖాన్ మరణించారని వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్మీ అధికారులు ఆయన క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

Next Story