ఎలాన్‌మస్క్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య బహిరంగ లేఖ

by Ajay Maddhiboyina |

పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెనీమా గోల్డ్‌స్మిత్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు.

ఎలాన్‌మస్క్‌కు ఇమ్రాన్‌ ఖాన్‌ మాజీ భార్య బహిరంగ లేఖ
X

దిశ‌, వెబ్ డెస్క్: పాక్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య జెనీమా గోల్డ్‌స్మిత్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు బహిరంగ లేఖ రాశారు. తన ఖాతాలో విజిబిలిటీ ఫిల్టరింగ్ సరిచేయాలని కోరారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి గురించి తాను పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని వెల్లడించారు. తాను ఇమ్రాన్ ఖాన్ గురించి పెడుతున్న పోస్టులను ఎక్స్ వేదికగా అణచివేస్తున్నారని ఆరోపించారు. వాక్ స్వాతంత్య్రం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఎవరూ వినని వాక్ స్వాతంత్య్రం కాదు కదా అని ప్రశ్నించారు.

కనీసం తన కుమారులు కూడా ఆయనను కలిసేందుకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ప్రాథమిక మానవ హక్కుల లేని ఒక రాజకీయ ఖైదీ అని ప్రపంచానికి చెప్పడానికి తనకు ఎక్స్ మాత్రమే మిగిలి ఉందని జమీమా ఆవేదన వ్యక్తం చేశారు. కానీ దానికి కూడా రీచ్ సున్నా అని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఇమ్రాన్ ఖాన్ 1995లో టీవీ జ‌ర్నిలిస్ట్ అయిన జ‌మీమాను వివాహం చేసుకున్నారు. కొన్ని కార‌ణాల వ‌ల్ల 2004లో వీరు విడాకులు తీసుకున్నారు. అప్ప‌టికే వీరికి ఇద్ద‌రు కుమారులు జ‌న్మించారు. విడిపోయిన‌ప్ప‌టికీ జ‌మీమా ఇమ్రాన్ ఖాన్ మంచి స్నేహితులుగా ఉండేవారు.

Next Story