- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీరు గెలిస్తే రైట్.. మేము గెలిస్తే తప్పా
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తారుమారు, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తారుమారు, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎ్లక్స్ లో కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, మహారాష్ట్రలో మీ అవమానకరమైన ఓటమి బాధ రోజురోజుకూ తీవ్రమవుతుందని అర్థమైందన్నారు. కానీ మీరు ఎంతకాలం ఇలా గుడ్డిగా బాణాలు సంధిస్తుంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు గెలిచిన చాలా ప్రాంతాల్లో 7 శాతం నుంచి 11 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య మహారాష్ట్రలోని 25 కంటే ఎక్కువ నియోజకవర్గాలలో ఓటర్ల సంఖ్య 8 శాతానికి పైగా పెరిగిందని వీటిలో చాలా వాటిలో కాంగ్రెస్ లేదా దాని మిత్ర పక్షాలు విజయం సాధించాయని ఫడ్నవీస్ చెప్పారు. పశ్చిమ నాగ్‌పూర్‌లో, ఓటర్ల సంఖ్య 7 శాతం (27,065) పెరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి వియాస్ థాక్రే గెలిచారు. ఉత్తర నాగ్‌పూర్‌లో 7 శాతం పెరుగుదల (29,348 ఓటర్లు) ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి నితిన్ రౌత్ విజయం సాధించారని ఫడ్నవీస్ అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు మాత్రమే ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించడం దురదృష్టకరమని షిండే అన్నారు. ‘కర్ణాటక లేదా తెలంగాణలో వారు గెలిచినప్పుడు, EVMలు ఎన్నికల కమిషన్ మంచివి. కానీ వారు ఓడిపోయినప్పుడు, వ్యవస్థ లోపభూయిష్టంగా మారుతుంది. ఇది మహారాష్ట్రను కించపరిచే కుట్ర’ అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక సంక్షేమ పథకాల వల్లే ఈ విజయం సాధ్యమైందని షిండే అన్నారు. వాటిలో లడ్కీ బహిన్ యోజన కూడా ఉందన్నారు.
ఇలాంటి ప్రశ్నలు ఓడిపోయిన తర్వాతే వస్తాయ్.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ ఓడిపోయిన తర్వాతే వస్తాయి. లోక్‌సభలో వారికి 31 సీట్లు వచ్చాయి. మాకు 17 సీట్లు మాత్రమే వచ్చాయి. గత ఏడాది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనే రాహుల్ గాంధీ ఆరోపణలను చర్చించడానికి భారత ఎన్నికల కమిషన్ (EC) ఆయనను వ్యక్తిగత సమావేశానికి ఆహ్వానించింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచిన మహారాష్ట్ర ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపించారు. ఎన్నికలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ల వ్యవధిని 45 రోజులకు తగ్గించాలనే ఈసీ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇది సాక్ష్యాలను నాశనం చేయడానికి సాయపడుతుందన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా అంశాలున్నా వాటిని కాంగ్రెస్ అభ్యర్థులు సంబంధిత హైకోర్టులో పిటిషన్ల రూపంలో ఇప్పటికే నివేదించి ఉంటారని అనుకుంటున్నట్లు లేఖలో ఎన్నికల కమిషన్ పేర్కొంది. మీకు ఇంకా ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే.. మాకు రాతపూర్వకంగా తెలియజేయవచ్చని తెలిపింది.






