- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Donald Trump: ఇరాన్ పై దాడి నాకు ముందే తెలుసు: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడి చేయగా ఆ దేశ కీలక సైనికాధికారి హుసేన్ సలామీ మరణించాడు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడి చేయగా ఆ దేశ కీలక సైనికాధికారి హుసేన్ సలామీ మరణించాడు. అయితే ఈ వైమానిక దాడుల గురించి తనకు ముందుగానే తెలుసు అని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఫ్యాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇరాన్ దేశానికి అణ్వాయుధాలు ఉండకూడదని మొదటి నుంచి మేం చెబుతున్నామని ట్రంప్ అన్నాడు. ఇరాన్ పై ఇజ్రాయిల్ చేసిన దాడుల్లో తాము పాల్గొనలేదని స్పష్టం చేశారు. ఇరాన్, ఇజ్రాయిల్ పై ప్రతీకార దాడులకు తెగబడే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు.
ఇజ్రాయిల్ లో అత్యవసర పరిస్థితి..
ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ‘ఇజ్రాయెల్‌కు గుణపాఠం చెప్పేందుకు తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. కచ్చితంగా ప్రతీకార దాడి తప్పదని ఇరాన్ భద్రతా దళాలు తెలిపాయి. దీనిపై దేశ అత్యున్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది. అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అత్యంత అప్రమత్తతగా ఉందని, అవసరమైతే అమెరికా ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ ఇప్పటికే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఎవరైనా మమ్మల్ని ఎదిరించే ప్రయత్నం చేస్తే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఇజ్రాయిల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని సూచించారు.






