భారీ వర్షాలు.. 266 మంది మృతి

by Yella Dhawani Reddy |

పాకిస్థాన్‌లో (Pakistan) రుతుపవనాల (Monsoon) ప్రభావంతో గత నెల రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆకస్మీక వరదలు సంభవించాయి.

భారీ వర్షాలు.. 266 మంది మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లో (Pakistan) రుతుపవనాల (Monsoon) ప్రభావంతో గత నెల రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఆకస్మీక వరదలు సంభవించాయి. దీంతో దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. జూన్ 26న ప్రారంభమైన ఈ వర్షాలు ఇప్పటికీ కొనసాగుతుండటంతో నదులు, వాగులు ఉప్పొంగాయి. దాంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్ష బీభత్సానికి రోడ్లు, వంతెనలు తెగిపోయి రవాణా వ్యవస్థ తలకిందులైంది. విద్యుత్, నీటి సరఫరా కూడా అంతరాయం ఏర్పడింది. ఇక ఈ భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 266 మంది మృతిచెందగా, వీరిలో 126 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్‌లో అత్యధికంగా 144 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 63 మంది, సింధ్‌లో 25 మంది, బలూచిస్థాన్‌లో 16 మంది, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 10 మంది, ఇస్లామాబాద్‌లో ఎనిమిది మంది మరణించారు. అలాగే, 628 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఇక గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అందులో పంజాబ్‌లో 488, ఖైబర్‌ పఖ్తుంఖ్వాలో 69, సింధ్‌లో 40, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో 18, బలూచిస్థాన్‌లో నలుగురు, ఇస్లామాబాద్‌లో ముగ్గురు గాయపడ్డారు. వర్ష కారణంగా 1,035 గృహాలు దెబ్బతిన్నాయని, 216 పశువులు మరణించాయని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA) తెలిపింది.

Next Story