లంక వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి స్టార్‌లింక్‌ సేవలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-03 13:02:08  IST  )

శ్రీలంకలో ఇప్పుడు స్టార్‌లింక్ హైస్పీడ్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి.

లంక వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి స్టార్‌లింక్‌ సేవలు
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీలంకలో ఇప్పుడు స్టార్‌లింక్ హైస్పీడ్ సాటిలైట్ ఇంటర్నెట్ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయాన్ని ఇవాళ (జూన్ 2) ఎక్స్‌లో ప్రకటించింది. దీంతో శ్రీలంకలోని గ్రామీణ ప్రాంతాలు, ఇంటర్నెట్‌కి తక్కువగా యాక్సెస్ ఉన్న ప్రాంతాలు కూడా త్వరితమైన డేటా సేవలకి జతకానున్నాయి. 2024లో టెలికమ్యూనికేషన్ చట్టాల్లో మార్పులు చేసి స్టార్‌లింక్‌కి లైసెన్స్‌ ఇచ్చిన తర్వాత ఈ సేవలు కార్యరూపం దాల్చాయి. అయితే జూన్‌ మొదటివారంలోనే శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే నుంచి దీనికి గ్రీన్‌సిగ్నల్‌ లభించినట్లు ప్రకటన విడుదలైంది. ఈ నిర్ణయానికి ముందు రెండు వారాలపాటు ప్రజాభిప్రాయ సేకరణను చేసి విశ్లేషించామని ప్రకటించింది.

స్టార్‌లింక్ సేవల ద్వారా వినియోగదారులు తక్కువ లాటెన్సీతో అధిక స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందగలుగుతారు. అయితే అక్కడ వన్‌టైమ్‌ హార్డ్‌వేర్‌ ఫీజు 1,18,000 శ్రీలంక రూపాయిలు కాగా.. అన్‌లిమిటెడ్‌ డేటాకు నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ రూ.15,000గా నిర్ణయించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా డిజిటల్ లోపాలను తగ్గిస్తూ, డిజిటల్ సమానత్వాన్ని అందించే దిశగా స్టార్‌లింక్ ఒక పెద్ద ముందడుగు వేసింది.

ఇప్పటికే 100+ దేశాల్లో ఈ సేవలు లభిస్తుండగా, భారత్‌లో కూడా స్టార్‌ లింక్‌కు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్‌ను టెలికాం విభాగం ప్రారంభించింది. వీటిని పొందిన మూడో కంపెనీగా నిలిచింది. ఇప్పటికే యులెల్సాట్‌ వన్‌వెబ్‌, రిలయన్స్‌ జియో దీనికంటే ముందు అనుమతులు సాధించాయి. సుదూర భూస్థిర ఉపగ్రహాలపై ఆధారపడే సంప్రదాయ ఉపగ్రహ సేవల మాదిరిగా కాకుండా.. లియో(లో ఎర్త్‌ ఆర్బిట్‌) ఉపగ్రహాల ద్వారా స్టార్‌ లింక్‌ ఈ సేవలను అందిస్తోంది.

Next Story