పీఎఫ్ ఖాతా దారులకు గుడ్ న్యూస్

by Ajay Maddhiboyina |

ఈపీఎఫ్ఓ ఖాతా దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 సంవ‌త్స‌రానికి 8.25 శాతం వడ్డీని కేంద్రం జ‌మచేస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి మ‌న్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

పీఎఫ్ ఖాతా దారులకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్ డెస్క్: ఈపీఎఫ్ఓ ఖాతా దారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. 2024-25 సంవ‌త్స‌రానికి 8.25 శాతం వడ్డీని కేంద్రం జ‌మచేస్తోంది. ఈ విష‌యాన్ని కేంద్ర మంత్రి మ‌న్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలోని 33.56 కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించి 13.55 లక్షల సంస్థలకు చెందిన ఉద్యోగుల ఖాతాల్లో వడ్డీ జమ చేసినట్టు తెలిపారు. మిగితా ఉద్యోగుల ఖాతాల్లో కూడా ఈ వారంలోనే డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. గతేడాది ఆగస్టు, డిసెంబర్ మధ్యలో వడ్డీ జమ చేయగా ఈ సారి జూలైలోనే పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమచేశారు. ఇదిలా ఉంటే జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అనేది భారతీయ ప్రభుత్వ ఉద్యోగులకు అందించే ఫండ్. ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల వేతనంలో కొంత మొత్తాన్ని జనరల్ ప్రావిడెంట్ ఫండ్‌కు కంట్రిబ్యూట్ చేయవచ్చు. జమ చేసిన మొత్తం డబ్బులను ఉద్యోగి రిటైర్మెంట్ తరవాత విత్ డ్రా చేసుకోవచ్చు. ప్రావిడెండ్ ఫండ్ వడ్డీ రేటును కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రతి 3నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. పెంచడం లేదా తగ్గించడం లేదా అలానే కంట్యూన్యూ చేస్తుంది.

Next Story