భారత్‌లో ఉగ్రకుట్ర భగ్నం..నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

by Ajay Maddhiboyina |

భారత్‌లో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసింది. కాగా దానిని అధికారులు భగ్నం చేశారు. కుట్రకు

భారత్‌లో ఉగ్రకుట్ర భగ్నం..నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్‌లో ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా భారీ ఉగ్రకుట్రకు ప్లాన్ చేసింది. కాగా దానిని అధికారులు భగ్నం చేశారు. కుట్రకు ప్లాన్ చేసిన నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరిని గుజరాత్‌లో అరెస్ట్ చేయగా మరో ఇద్దరిని ఒక్కొక్కరి చొప్పున ఢిల్లీ, నోయిడాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పహల్గామ్ ఎటాక్ తరవాత భారత్ ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.

ముఖ్యంగా అల్ ఖైదాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు చేసింది. ఆ సంస్థకు చెందిన పలువురు ప్రముఖులను మట్టుబెట్టింది. ఆ సమయంలో అల్ ఖైదా ఇండియాకు వార్నింగ్ ఇచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఉగ్రకదలికలపై నిఘా పెంచారు. ఇప్పటికే పలు ఉగ్రకుట్రలను భగ్నం చేయగా తాజాగా మరోసారి నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

Next Story