Iran-Israel War: ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయిల్ భీకర దాడులు

by Shamantha N |

ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే లక్ష్యంతో ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ లో కీలక ఇస్సహాన్ అణు కేంద్రంపై ఫైటర్ జెట్లతో దాడులకు పాల్పడింది.

Iran-Israel War: ఇరాన్ అణ్వాయుధ స్థావరాలపై ఇజ్రాయిల్  భీకర దాడులు
X

దిశ ,నేషనల్ బ్యూరో: ఇరాన్‌ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదనే లక్ష్యంతో ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఇరాన్ లో కీలక ఇస్సహాన్ అణు కేంద్రంపై ఫైటర్ జెట్లతో దాడులకు పాల్పడింది. అణు కేంద్రం నుంచి న్యూక్లియర్ కు సంబంధించిన విష వాయువులు లీక్ కాలేదని ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ తాజాగా జరిపిన దాడుల్లో అణ్వాయుధాల తయారీకి ఉపయోగించే పరికరాలు, ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపింది. ఇజ్రాయెల్‌ ఫైటర్ జెట్‌లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వైమానిక దళం.. డ్రోన్ యూనిట్ కమాండర్ ను చంపేసింది. ఈ మధ్య ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ పై దాడి చేసిన వారిలో అతడే ప్రముఖడని ఐడీఎఫ్ పేర్కొంది. వెస్ట్ ఇరాన్‌లోని బాలిస్టిక్ మిస్సైల్ తయారీ కేంద్రాలపై 25 యుద్ధ విమానాలతో ఇజ్రాయిల్ దాడులు చేసింది. కాస్పియన్ సముద్రతీరంలోని రాస్త్‌ నగరంపైనా టెల్‌అవీవ్‌ బాంబులతో విరుచుకుపడింది. దీనికి ప్రతిగా ఇరాన్ అంతే సంఖ్యలో ఇజ్రాయిల్ లోని గోలన్ హైట్స్ లోని అనేక ప్రాంతాల్లో మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. కాాగా వాటిని జనసమ్మర్థం లేని ప్రాంతాల్లో కూల్చేస్తున్నట్లు ఇజ్రాయిల్ పేర్కొంది.

ఆపరేషన్ సింధులో పొరుగు దేశాలకు సాయం

ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం భీకరంగా మారడంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తగా పెరిగింది.ఈ క్రమంలో ఇరాన్ లో ఉన్న భారతీయులను వెనక్కి తీసుకువచ్చేందుకు ‘ఆపరేషన్ సింధు’ చేపట్టగా.. పొరుగు దేశాల స్టూడెంట్లను కూడా తీసుకువస్తూ భారత్ పెద్ద మనసును చాటుకుంటుంది. నేపాల్, శ్రీలంక దేశాలు తమ స్టూడెంట్లను కూడా తీసుకురావాలని భారత్‌ను కోరాయి. ఆయా దేశాల రాయబార కార్యాలయాలను ఈ విషయాన్ని భారత్ చెప్పడంతో సాయం చేస్తున్నారు. ఇప్పటి వరకు 517 మంది ఇండియన్స్ స్వదేశానికి చేరుకున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.

Next Story