- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran-Israel War: రైతులకు షాక్..పెరగనున్న యూరియా రేట్లు?
LNG ఉత్పత్తి నిలిచిపోవడంతో ఇండియాలో యూరియా ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. దీంతో యూరియా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్-అమెరికా మధ్య వార్ భయంకరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎవరు కూడా తగ్గడం లేదు. శాంతి చర్చలకు రావడం లేదు. దాదాపు 5 రోజులుగా దేశాల మధ్య వార్ కొనసాగుతోంది. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తున్నాయి. ఇక ఈ దాడులకు కౌంటర్ కూడా ఇరాన్ నుంచి వస్తోంది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ పై నేరుగా దాడులు చేయకుండా, మిడిల్ ఈస్ట్ దేశాలపై టార్గెట్ చేసింది ఇరాన్. దీంతో దుబాయ్, సౌదీ అరేబియా, ఖతర్ లాంటి దేశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ ప్రాణ భయంతో వణికిపోతున్నారు.
యూరియా ఉత్పత్తి తగ్గుదల.. ధరలు పెరిగే ఛాన్స్ !
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఖతర్ లో LNG ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. యుద్ధం ముగిసే సమయం వరకు ఈ పరిస్థితి నెలకొని ప్రమాదం ఉంది. అయితే దీని ఎఫెక్ట్ ఇండియా పైన పడింది. LNG ఉత్పత్తి నిలిచిపోవడంతో మన ఇండియాలో యూరియా ఉత్పత్తిని కంపెనీలు తగ్గిస్తున్నాయి. వాస్తవంగా ఈ యూరియా ఉత్పత్తికి LNG ప్రైమరీ ఫీడ్ స్టాక్. ఇది ఎనర్జీ సోర్స్ గానే కాకుండా ఎరువుల తయారీ ప్రక్రియలో కూడా కీలకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీని కొరత ఉన్న నేపథ్యంలో ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ తరుణంలో యూరియా కొరత ఏర్పడితే మాత్రం... రైతులకు చుక్కలు కనిపించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కొరత ఏర్పడితే కచ్చితంగా యూరియా ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని ప్రస్తుతానికి అయితే ఎరువుల మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
నోట్: LNG అంటే యూరియా ఉత్పత్తిలో ఉపయోగించి ధ్రవీకృత సహజ వాయువు






