- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సముద్రంలో మునిగిన ఫెర్రీ.. 13 మంది జలసమాధి, వంద మందికి పైగా గల్లంతు
300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఫెర్రీ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: 300 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఫెర్రీ సోమవారం తెల్లవారుజామున సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటన సౌత్ ఫిలిప్పీన్స్ లో వెలుగుచూసింది. ఫెర్రీ ప్రమాదంలో ఇప్పటివరకూ 13 మంది జలసమాధి అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు 244 మందిని రక్షించాయి. మిగతా ప్రయాణికులు, సిబ్బంది ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
జాంబోంగా నగరం నుంచి సులు ప్రావిన్స్ లోని జోలో ద్వీపానికి ఫెర్రీ ప్యాసింజర్లతో బయల్దేరగా.. బాసిలన్ ప్రావిన్స్ లోని బలుక్ బలుక్ ద్వీపం సమీపంలో సముద్రంలో మునిగిపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది, సమీపంలో ఉన్న మత్స్యకారులు, నౌకలు వెంటనే అక్కడికి చేరుని సహాయక చర్యలు చేపట్టి 13 మంది మృతదేహాలను వెలికితీశారు. ఎంతమంది గల్లంతయ్యారన్నదానిపై కచ్చితమైన సమాచారం లేదు. కాగా.. ఫెర్రీ మునిగిపోవడానికి గల కారణాలు తెలియదని, దర్యాప్తు చేస్తున్నామని తీరప్రాంత పోలీసులు, అధికారులు తెలిపారు. పోర్టు నుంచి బయల్దేరే ముందు కోస్ట్ గార్డు తనిఖీల్లో ఎలాంటి ఓవర్ లోడ్ సంకేతాలు లేవని స్పష్టం చేశారు. 1987లో డోనా పాజ్ ఫెర్రీ ప్రమాదంలో 4300 మందికి పైగా మరణించిన ఘటన.. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర ప్రమాదంగా నిలిచింది.






