తైవాన్ ఆర్మీ సమాచారాన్ని చైనాకు అందిస్తున్న తండ్రి, కొడుకు.. 8 ఏళ్ల జైలు శిక్ష

by Disha Web Desk 17 |
తైవాన్ ఆర్మీ సమాచారాన్ని చైనాకు అందిస్తున్న తండ్రి, కొడుకు.. 8 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: తైవాన్ ఆర్మీకి చెందిన రహస్య సమాచారాన్ని చైనాకు చేరవేస్తున్న తైవాన్ జాతీయులైన తండ్రి, కొడుకులకు ఆ దేశం ఒక్కొక్కరికి 8 ఏళ్ల జైలు శిక్ష విధించింది. హువాంగ్ లంగ్-లంగ్, అతని కుమారుడు హువాంగ్ షెంగ్-యు 2019 నుంచి "రహస్య రక్షణ పత్రాలను" సేకరించి బీజింగ్‌కు అందిస్తున్నారని వీరిపై ఉన్న ప్రధాన ఆరోపణ. దీనికోసం మరికొంత మందితో ఒక సంస్థను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. వీరు చైనాలో ఉన్న వ్యాపారవేత్తలకు తైవాన్ దేశ రహస్యాలు అందించడానికి వైమానిక రక్షణ, క్షిపణి బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సైనికులకు లంచం ఇచ్చారు. అయితే ఈ కేసులో ఏ రకమైన సమాచారం లీక్ అయిందనేది మాత్రం తెలియరాలేదు. నవంబరులో కూడా పది మంది సైనికులు చైనా కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలు వచ్చాయి. గతంలో గూఢచర్యం చేసి చైనాకు జాతీయ భద్రతా సమాచారాన్ని రహస్యంగా అందజేసినందుకు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ కల్నల్‌కు అక్టోబర్‌లో 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. చైనా-తైవాన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతుంది. తైవాన్‌ను తన భూభాగం అని చైనా పేర్కొంటుండగా, దీనిని తైవాన్ వ్యతిరేకిస్తుంది. దీంతో ఒకరిపై ఒకరు గూఢచర్యం చేస్తున్నారు.



Next Story

Most Viewed