- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Iran : భారత విద్యార్థులకు 300 మీ. దూరంలో పేలుడు!
ఇరాన్ లో భారత విద్యార్థులు ఉంటున్న స్థావరానికి 300 మీటర్ల దూరంలోనే పేలుడు సంభవించింది.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు రోజులుగా యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ లోని ఉర్మియా నగరంపైన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపాయి. ఈ నేపథ్యంలోనే భారత విద్యార్థులు ఉంటున్న స్థావరానికి 300 మీటర్ల దూరంలోనే పేలుడు సంభవించింది.
విద్యార్థులు ఈ పేలుడు సంభవించిన ప్రదేశానికి 300 మీటర్ల దూరంలోనే హాస్టల్లో ఉన్నారు. అయితే ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో విద్యార్థులు ఉన్న హాస్టల్ బిల్డింగ్ షేక్ అయిపోయింది. దీంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థులు. ప్రతి గంటకు ఫైటర్ జట్లు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. సిటీలోని ప్రజలు వెళ్లిపోతున్నారని ఎమోషనల్ అవుతున్నారు. దాడి తర్వాత ఆ ప్రాంతమంతా పొగ కమ్మేసిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఉర్మియా యూనివర్సిటీలో కాశ్మీరీ విద్యార్థులు చదువుకుంటున్నట్లు సమాచారం అందుతోంది.






