ఎమర్జెన్సీ పాలనలో దేశ ప్రజల్ని బానిసలుగా చేయాలనుకున్నారు: ప్రధాని మోదీ

by Shamantha N |

ప్రధాని నరేంద్ర మోదీ 123 మన్ కీ బాత్ లో ఆదివారం ప్రసంగించారు. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసుకున్నారు.

ఎమర్జెన్సీ పాలనలో దేశ ప్రజల్ని బానిసలుగా చేయాలనుకున్నారు: ప్రధాని మోదీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోదీ 123 మన్ కీ బాత్ లో ఆదివారం ప్రసంగించారు. దేశంలో ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని అభాసుపాలు చేశారని న్యాయ విభాగాన్ని తమ బానిసలుగా మార్చుకోవాలని అప్పటి పాలకులు అనుకున్నారని విమర్శించారు. భారత ప్రజలు శక్తిమంతమైన వారు కాబట్టి ఎమర్జెన్సీ తొలిగిపోయిందన్నారు. అప్పట్లో జార్జ్ ఫెర్నాండెజ్ ను అరెస్టు చేసి జైళ్లో బంధించారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ పై పోరాడిన వారిని ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. అత్యవసర పరిస్థితి అనంతరం జరిగిన ప్రసంగంలో.. అప్పటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ప్రసంగాన్ని ప్రధాని ప్రస్తావించారు. ఇందిరా గాంధీ పాలనలో అణచివేత వాతావరణం సంవత్సరాలుగా కొనసాగిందని 1975 నుంచి 1977 మధ్య 21 నెలల అత్యవసర పాలన సమయంలో అది అత్యంత భయానకస్థాయికి చేరింది. ప్రజల స్వేచ్ఛ హక్కులు కాలరాయబడ్డాయి. వార్తా పత్రికలపై ఆంక్షలు విధించారని గుర్తు చేశారు.

న్యాయవ్యవస్థ నిర్వీర్యం..

ఆ సమయంలో న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేయాలని అనుకున్నారని చెప్పారు. లక్షల మందిని అరెస్టు చేసి, ఏకపక్ష పాలనను రుద్దిన తీరును ప్రపంచ చరిత్రలోనే దారుణమైన సంఘటన అని మొరార్జీ దేశాయ్ విమర్శించిన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. అత్యవసర పరిస్థితిలో వేలాది మంది ప్రజలు హింసకు గురైన ఉదంతాలను దేశం మరచిపోలేదని ప్రధాని అన్నారు. (MISA) చట్టం ద్వారా నిందితులను నిర్బంధించడం, విద్యార్థులపై వేధింపులు, భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేయడం వంటి దుర్ఘటనలను ఆయన ప్రస్తావించినట్లు తెలిపారు. అప్పటి అటల్ బిహారీ వాజ్‌పేయి, జగ్జీవన్ రామ్‌ల ప్రసంగాలను కూడా మోదీ గుర్తు చేశారు.

Next Story