- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లిక్కర్ షాపులోకి దూరిన జంతువు.. మద్యం తాగి మత్తులో జోగుతూ..
మద్యం దుకాణంలోకి దూరిన ఓ జంతువు.. ఆ షాపులోని మద్యం బాటిళ్లను పగలగొట్టి..

దిశ, వెబ్‌డెస్క్: మద్యం దుకాణంలోకి దూరిన ఓ జంతువు.. ఆ షాపులోని మద్యం బాటిళ్లను పగలగొట్టి.. నేలపై పడిన మద్యం టేస్ట్ చూసి.. అక్కడే ఉన్న బాత్రూమ్లో మత్తులో జోగుతూ కనిపించింది. ఈ ఘటన అమెరికాలోని వర్జీనియాలో వెలుగుచూసింది. ఆష్లాండ్ లో ఉన్న ఓ మద్యం షాపులో సీలింగ్ టైల్ నుంచి ఒక రకూన్ కింద పడిపోయింది. ఆ టైమ్ లో షాపు క్లోజ్ చేసి ఉండగా.. రకూన్ అక్కడున్న స్కాచ్, విస్కీ సీసాలను ధ్వంసం చేసింది. అంతటితో ఊరుకోకుండా.. పగిలిన బాటిళ్ల నుంచి వచ్చిన మద్యాన్ని టేస్ట్ చేసింది. ఆ మత్తులో బాత్రూమ్ లోకి వెళ్లి పడుకుంది.
మరుసటి రోజు ఉదయం.. రకూన్ బాత్రూమ్ లో స్పృహ కోల్పోయి పడి ఉండగా దానిని గుర్తించిన ఉద్యోగి.. జంతు సంరక్షణ అధికారులకు సమాచారమిచ్చాడు. అక్కడికి వెళ్లిన అధికారులు రకూన్ ను హనోవర్ కౌంటీ యానిమల్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్ కు తరలించగా.. అది మత్తు నుంచి కోలుకున్నట్లు తెలిపారు. కొన్నిగంటల నిద్ర తర్వాత అడవిలోకి వదిలినట్లు వెల్లడించారు.






