- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాడిద పాలతో సబ్బు.. మార్కెట్‌లో ట్రెండింగ్ ఇదే!!
గాడిద పాలతో తయారు చేసిన సబ్బు దుబాయ్‌లో సంచలనం సృష్టిస్తోంది. యూఏఈ, జోర్డాన్, ఈజిప్ట్, గల్ఫ్ దేశాల్లోనూ బాగా అమ్ముడుపోతుంది. నిజానికి గతేడాది ఈ సోప్ ప్రవేశపెట్టినప్పుడు జనాలు ఎగతాళి చేశారు. కానీ

దిశ, వెబ్ డెస్క్ : గాడిద పాలతో తయారు చేసిన సబ్బు దుబాయ్‌లో సంచలనం సృష్టిస్తోంది. యూఏఈ, జోర్డాన్, ఈజిప్ట్, గల్ఫ్ దేశాల్లోనూ బాగా అమ్ముడుపోతుంది. నిజానికి గతేడాది ఈ సోప్ ప్రవేశపెట్టినప్పుడు జనాలు ఎగతాళి చేశారు. కానీ దాని ఎఫెక్ట్ చూశాక కొనేందుకు ఎగబడుతున్నారు. చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉందని నమ్ముతున్నారు.
ఎందుకంత డిమాండ్?
గాడిద పాలతో తయారు చేసిన సోప్‌తో స్నానం చేయడం వల్ల చర్మంలో అనేక మార్పులు కనిపిస్తుండగా.. దీనికే అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. గాడిద పాలలో ప్రోటీన్స్, మినరల్స్, యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువ. కాగా ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు, సూర్యరశ్మి నుంచి చర్మాన్ని కాపాడేందుకు, అకాల వృద్ధాప్యం నుంచి పోరాడేందుకు సహాయపడుతాయి. చర్మ కణాలను పునరుత్పత్తి చేసి.. ముడతలను తగ్గిస్తాయి. మొటిమలు, మచ్చలను తొలగిస్తాయి. తామర నుంచి ఉపశమనం పొందటానికి కూడా గాడిద పాలు సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
ధర ఎంత?
ఈ సోప్ ధర రూ. 600 నుంచి రూ. 2500 మధ్యలో ఉంటుంది. జోర్డాన్‌కు చెందిన ‘అటాన్ డంకీ మిల్క్ సోప్ కంపెనీ’ ఈ సోప్ తయారు చేసింది. కంపెనీ యజమాని ఇమాద్ అతియాత్, అతని తల్లి సల్మా అల్ జుబి ఈ కంపెనీని ప్రారంభించారు. తమ ఫర్మ్‌లోని 12 గాడిదల పాలును ఇందుకు ఉపయోగిస్తున్నారు. ఒక్క లీటర్ పాల నుంచి దాదాపు 30 సబ్బులు తయారు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్, కొబ్బరి నూనె, షియా వెన్నెను ఈ పాలకు జోడించి సోప్‌ను తయారు చేస్తున్నారు.






