డీల్ చేసుకోకపోతే విరుచుకుపడతాం: ట్రంప్ హెచ్చ‌రిక‌

by velandi.Saikiran |

కాల్పుల నేపథ్యంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్‌.

డీల్ చేసుకోకపోతే విరుచుకుపడతాం: ట్రంప్ హెచ్చ‌రిక‌
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్ వర్సెస్ అమెరికా మధ్య మళ్ళీ కాల్పులు జరిగాయి. ముందుగా ఇరాన్ దాడి చేయగా.. దానికి అమెరికా కూడా కౌంటర్ ఇచ్చింది. అయితే ఈ కాల్పుల నేపథ్యంలో ఇరాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్‌. వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోకపోతే దాడులతో విరుచుకుపడతామని హెచ్చరించారు ట్రంప్. ఇరాన్ దాడులలో తమ మూడు యుద్ధ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని క్లారిటీ ఇచ్చారు. ఎదురు దాడుల్లో అనేక ఇరాన్ డ్రోన్లు, బోట్లు ధ్వంసం అయినట్లు వివరించారు. సాధారణ దేశమైతే తమ నౌకలకు అనుమతి ఇచ్చేదని.. కానీ పిచ్చి వాళ్ల చేతిలో ఉండటంతో ఇరాన్ ఈ పని చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story