ఇంధనం బ్యాన్ పై వెనక్కి తగ్గిన ఢిల్లీ సర్కార్!

by Ajay Maddhiboyina |

ఇంధనం బ్యాన్‌పై ఢిల్లీ సర్కార్ వెనక్కి తగ్గింది. కాలం చెల్లిన వాహనాల‌కు ఇంధ‌నం బ్యాన్ చేయ‌డం సాధ్యం ప‌డ‌టం లేద‌ని ప్ర‌క‌టించింది. పదేళ్లు దాటిన వాహ‌నాలు పూర్తిగా బ్యాన్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది.

ఇంధనం బ్యాన్ పై వెనక్కి తగ్గిన ఢిల్లీ సర్కార్!
X

దిశ, వెబ్ డెస్క్: ఇంధనం బ్యాన్‌పై ఢిల్లీ సర్కార్ వెనక్కి తగ్గింది. కాలం చెల్లిన వాహనాల‌కు ఇంధ‌నం బ్యాన్ చేయ‌డం సాధ్యం ప‌డ‌టం లేద‌ని ప్ర‌క‌టించింది. పదేళ్లు దాటిన వాహ‌నాలు పూర్తిగా బ్యాన్ చేస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. కాగా మూడు రోజుల క్రిత‌మే ఢిల్లీలో ప‌దేళ్లు దాటిన వాహ‌నాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధ‌నం అమ్మ‌కూడ‌దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. కానీ అది ప్రాక్టిక‌ల్‌గా సాధ్యం కాకపోవడంతో వెనక్కి తగ్గింది. ఇక గత ప్రభుత్వంలో చేసినట్టుగానే ఆ వాహనాలపై బ్యాన్ విధిస్తామని చెప్పింది.

ఇదిలా ఉంటే ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచుతున్న సంగతి తెలిసిందే. మిగితా కాలాల కంటే చలికాలంలో అక్కడ కాలుష్యం తీవ్రత మరింత పెరిగిపోతుంది. ఉదయం లేచిందంటే కాలుష్యం వల్ల రోడ్లపై ముందు వెళ్లే వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్యమైన నగరాల్లో ఢిల్లీ కూడా చేరిపోయింది. దీంతో కాలుష్య కట్టడికి గత కేజ్రీవాల్ సర్కార్ అనేక ప్రయత్నాలు చేసినా ఆశించినమేర ఫలితాలు రాలేదు. ప్రస్తుతం ఢిల్లీలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా కాలుష్యాన్ని అరికట్టేందుకు అనేక ఉపాయాలు చేస్తోంది.

Next Story