- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్యంత విషపూరితమైన బొంత పురుగు.. మనిషి ప్రాణాలను కాపాడుతుందా?
సాధారణంగా విషపూరితమైన జీవులు అనగానే.. పాములు, తేళ్లు, కందిరీగలు వంటి గుర్తొస్తుంటాయి.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా విషపూరితమైన జీవరాశులు అనగానే.. పాములు, తేళ్లు, సాలీడు, కందిరీగలు వంటి గుర్తొస్తుంటాయి. కానీ, బొంత పురుగుల్లో కూడా పాముల కంటే విషపూరితమైనవి ఉంటాయని చాలామందికి తెలియదు. అంతేకాదు, ఈ విషంతో మనుషుల ప్రాణాలు కాపాడే కొత్త ఔషదాలను కూడా తయారు చేసే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
లోనోమియా అనే బొంత పురుగులు అత్యంత విషపూరితమైనది. దీని విషం వల్ల మనుషి రక్తం గడ్డ కట్టి చనిపోవడం, లేదా శాశ్వత వైకల్యం కలిగే ప్రమాదం ఉంటుంది. అయితే, ఔషధాల తయారీకి ఉపయోగపడే రసాయన సమ్మేళనాలు వీటి విషంలో అధికంగా ఉన్నాయని, అందుకోసం వీటిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు చెబుతున్నారు. బొంత పురుగులు తమ శరీరంపై నిటారుగా ఉండే ముళ్ల ద్వారా విషాన్ని విడుదల చేస్తాయి. ఒక్కో బొంత పురుగులో ఒక్కో రకమైన విషం ఉంటుంది. అలాగే విషంలోని రసాయన సమ్మేళనాలు కూడా వేర్వేరుగా ఉంటాయి. కొన్నింటిలో వంద రకాలకు పైగా రసాయన సమ్మేళనాలు ఉంటాయని, కాబట్టి సాధ్యమైనన్ని ఎక్కువ రకాల బొంత పురుగులపై పరిశోధన చేయాల్సి ఉంటుందని వివరించారు.
ఇప్పటి వరకు పాములు, తేళ్లు, సాలీడు వంటి వాటి విషంపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరిగాయి. కానీ, బొంత పురుగులతో పాటు చాలా రకాల విషపూరిత కీటకాలు, జీవులపై పరిశోధనలు జరగలేదు. ఇక ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనల ప్రకారం.. లోనోమియా లాంటి జాతులకు చెందిన బొంత పురుగుల విషంతో విరుగుడు(యాంటీ వీనమ్) ఔషధాలు తయారు చేయొచ్చని పరిశోధకులు కనుగొన్నారు. అయితే బొంత పురుగుల విషంతో ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఔషధం తయారు చేయలేదు. దీనిపై ఇంకా లోతుగా పరిశోధనలు చేశాక ఆ దిశగా అడుగులు వేయనున్నట్లు వివరించారు.






