బిగ్ ట్విస్ట్.. సివిల్ మాక్ డ్రిల్ వాయిదా

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో.. ఇప్పటికి కూడా మోడీ ప్రభుత్వం అలర్ట్ గానే ఉంటుంది. ఏది

బిగ్ ట్విస్ట్.. సివిల్ మాక్ డ్రిల్ వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో.. ఇప్పటికి కూడా మోడీ ప్రభుత్వం అలర్ట్ గానే ఉంటుంది. ఏది జరిగినా.. రివర్స్ ఎటాక్ చేసేందుకు సంసిద్ధంగా ఉంది మోడీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే తాజాగా సివిల్ మాక్ డ్రిల్ ( Civil Mock Drill ) నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం ( Modi Govt) నిర్ణయం తీసుకుంది. మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ నెల 29వ తేదీన అంటే గురువారం రోజున ఈ మాక్ డ్రిల్ జరగాల్సి ఉంది.

ఈ ప్రకటన మధ్యాహ్నం రాగ... కాసేపటి క్రితం మరో అధికారిక ప్రకటన వచ్చింది. సివిల్ మాక్ డ్రిల్ వాయిదా వేయాలని పలు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ మాక్ డ్రిల్ నిర్వహించాలని ముందుగా నిర్ణయం తీసుకోగా... రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హర్యానా అలాగే జమ్మూ రాష్ట్రాల్లో వాయిదా వేస్తున్నట్లు.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తాజాగా నిర్ణయం తీసుకొని ప్రకటన చేశాయి. గురువారం రోజున ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే వాయిదా వేస్తున్నట్టు వెల్లడించాయి రాష్ట్రాలు. త్వరలోనే కొత్త తేదీ ప్రకటించి మాక్ డ్రిల్ నిర్వహిస్తామని పేర్కొన్నాయి.

Next Story