- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ నెల చివర్లో చైనాకు రక్షణమంత్రి.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలోని కింగ్‌డావో కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం చైనా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాలోని కింగ్‌డావో కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ సంవత్సరం చైనా ఈ శిఖరాగ్ర సమావేశాన్ని నిర్వహిస్తోంది. జూన్ చివరలో ఈ సమావేశం ఉండే అవకాశం ఉంది. దీనికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను చైనా ఆహ్వానించింది. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత రాజ్‌నాథ్ సింగ్ చైనాలో పర్యటించనున్న మొదటి పర్యటన కావడం విశేషం. తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి గస్తీని తిరిగి ప్రారంభించడానికి దళాలను ఉపసంహరించుకోవడానికి 2024 అక్టోబర్‌లో రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలను తగ్గించడానికి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి భారత్, చైనా చర్చలు జరిపే అవకాశం ఉంది.
వాయు రవాణా మెరుగుపడే అవకాశం
లావోస్‌లో జరిగిన ADMM-ప్లస్ శిఖరాగ్ర సమావేశంలో రాజ్ నాథ్ సింగ్ చివరిసారిగా చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్‌ను కలిశారు. కాగా రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరిచేందుకు ఈ పర్యటన ఉపయోగపడనుంది. కైలాస్ మానసరోవర్ యాత్రను పునరుద్ధరించడం, వాయు రవాణాను తిరిగి మెరుగుపరచడం, జల సంబంధమైన అంశాల డెవలప్ మెంట్ చర్చకు వచ్చే అవకాశం ఉంది. చైనా SCO అధ్యక్ష పదవికి ఇండియా తన మద్దతును ప్రకటించింది. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి, చైనా ఉప విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్ మధ్య ఇటీవల ఢిల్లీలో జరిగిన చర్చల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.






