'భరతనాట్యం'లో.. చరిత్ర సృష్టించిన 'చైనా' అమ్మాయి.!

by Geesa Chandu |   (  Updated:2024-08-14 09:34:05  IST  )

మన దేశానికి చెందిన ప్రాచీన నృత్య కళ.. 'భరత నాట్యాని'కి చైనా దేశంలో అరుదైన గౌరవం దక్కింది.

భరతనాట్యంలో.. చరిత్ర సృష్టించిన చైనా అమ్మాయి.!
X

దిశ, వెబ్ డెస్క్: మన దేశానికి చెందిన ప్రాచీన నృత్యకళ.. 'భరత నాట్యాని' కి చైనా దేశంలో అరుదైన గౌరవం దక్కింది. చైనా కు చెందిన 13 ఏళ్ల బాలిక భరత నాట్య ప్రదర్శనతో అదరగొట్టింది. ఆ బాలిక పేరు లీ ముజీ. ఆమె బాల్యం నుంచే భరత నాట్యం పై మక్కువ పెంచుకొని, 2014 నుంచే చైనాలో పూర్తిస్థాయి భరత నాట్యం నేర్చుకొంది. చైనాలోని ఒక ఆడిటోరియంలో "అరంగేట్రం" ప్రదర్శనను ఇచ్చిన తొలి చైనా విద్యార్థినిగా 'లీ ముజీ' ఇప్పుడు నిలిచింది. అయితే లీ కు శిక్షణ ఇచ్చింది మాత్రం చైనీస్ భరతనాట్య నృత్యకారిణి జిన్ షాన్ షాన్. ఈ అరగేంట్రం ప్రదర్శనకు ఇండియన్ అంబాసిడర్ ప్రదీప్ రావత్ సతీమణి శృతి రావత్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ ప్రదర్శనను చూసేందుకు పెద్ద సంఖ్యలో చైనీయులు తరలివచ్చారు. లీ ముజీ ప్రదర్శనతో చైనా దేశానికి మన దేశ నృత్యకళను చాటి చెప్పినట్టయింది. అయితే మన దేశంలో కూడా లీ ముజీ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధమవుతోందట. ఆమె ఆగస్టు చివరి వారంలో చెన్నైలో ప్రదర్శనను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story