- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఏడాదిలో చైనా కీలక నిర్ణయం.. కండోమ్స్‌పై 13 శాతం పన్ను
కొత్త సంవత్సరంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కండోమ్స్ తో పాటు గర్భ నిరోధక వస్తువులు, మందులపై భారీగా పన్ను విధించింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో జనాభా సంక్షోభాన్ని అధిగమించేందుకు.. కొత్త సంవత్సరంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. జననాల రేటు పెంచేందుకు చర్యలు చేపట్టింది. కండోమ్స్ తో పాటు గర్భ నిరోధక వస్తువులు, మందులపై భారీగా పన్ను విధించింది. నేటి నుంచే ఈ పన్నులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. చైనాలో దశాబ్దాల కాలంగా ఒకరికి ఒకబిడ్డ అనే నిబంధన ఉంది. 1993లో ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన చైనా.. జనాభా నియంత్రణను ప్రోత్సహించింది. అప్పుడు కండోమ్స్ పై పన్నును మినహాయించింది. కానీ.. ఇప్పుడు ఆ నిబంధనే చైనా కొంపముంచింది. జనాభా సంక్షోభానికి దారితీసింది. గడిచిన మూడేళ్లుగా జననాల రేటు తగ్గింది. పదేళ్ల క్రితం ఏడాదికి 1.88 కోట్ల జననాలు నమోదవ్వగా.. గతేడాది 95.4 లక్షలుగా నమోదయింది. దీంతో జననాల సంఖ్యను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది.
కాబోయే తల్లిదండ్రులకు ట్యాక్స్ రిలీఫ్
తమ దేశ జనాభాను పెంచుకునేందుకు 2026 నుంచి కండోమ్స్, గర్భనిరోధక సాధనాలు, మందులపై పన్నులు పెంచనున్నట్లు చైనా 2025 డిసెంబర్లోనే ప్రకటించింది. దాని ప్రకారం నేటి నుంచి కండోమ్స్ ధరలకు రెక్కలొచ్చాయి. చైల్డ్ కేర్ సర్వీసులు, వృద్ధుల సంరక్షణ కేంద్రాలు, వికలాంగుల సేవల, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపులు ప్రకటించింది. వీటితో కాబోయే తల్లిదండ్రులకు ట్యాక్స్ రిలీఫ్ కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు ప్రసూతి సెలవులను పెంచడం, అబార్షన్లను తగ్గించడం వంటి చర్యలు కూడా తీసుకుంటోంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పిల్లల్ని కనేందుకు భయపడుతున్న చైనీయులు
పిల్లల్ని కనేందుకు చైనీయులు భయపడుతున్నారు. అందుకు కారణం వారి పెంపకానికి అయ్యే ఖర్చే. పిల్లల్ని పెంపకం అత్యంత ఖరీదైన దేశాల్లో చైనా ఒకటి. 18 ఏళ్ల వరకూ పిల్లల్ని పెంచేందుకు సుమారు 76 వేల డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.68 లక్షలు ఖర్చవుతున్నట్లు అక్కడి నిపుణులు అంచనా వేశారు. యువతలో ఈ ఆలోచనను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
కండోమ్స్ పై పన్నుభారం.. హెచ్ఐవీపై ఆందోళన
మరోవైపు హెచ్ఐవీపై ఆందోళన పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ కేసులు తగ్గుతుంటే.. చైనాలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉంది. గడిచిన 20 ఏళ్లతో కంపేర్ చేస్తే.. ప్రస్తుతం హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరిగింది. ఈ సమయంలో కండోమ్స్ పై పన్ను విధించడం హెచ్ఐవీ వ్యాప్తికి దారితీస్తుందన్న వాదన కూడా ఉంది.






