Indus River water cut: సింధు నది నీటి నిలిపివేతపై పాక్ ప్రధానికి కేంద్రం కౌంటర్ ఎటాక్

by Shamantha N |   (  Updated:2025-06-01 07:21:01  IST  )

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ pakisthan pm sharif సింధు నది నీటి నిలిపివేత గురించి ప్రపంచ వేదికపై భారత్‌ను విమర్శించారు. ఇండస్ ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ‘నీటి ఆయుధీకరణ’ అని విమర్శించారు.

Indus River water cut:  సింధు నది నీటి నిలిపివేతపై పాక్ ప్రధానికి కేంద్రం కౌంటర్ ఎటాక్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ pakisthan pm sharif సింధు నది నీటి నిలిపివేత గురించి ప్రపంచ వేదికపై భారత్‌ను విమర్శించారు. ఇండస్ ఒప్పందాన్ని నిలిపివేయడాన్ని ‘నీటి ఆయుధీకరణ’ అని విమర్శించారు. ఇండియా ఏకపక్షంగా, అక్రమంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కోట్లాది ప్రాణాలు రాజకీయ ప్రయోజనాల కోసం బలవ్వకూడదన్నారు. కాగా పాకిస్తాన్ ప్రధాని వ్యాఖ్యలు అసంబద్ధమైనవని అభివర్ణించిన భారత్ తమను నిందించడాన్ని ఆపాలని పాకిస్థాన్ ను హెచ్చరించింది. సరిహద్దుల వెంబడి ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందు వల్లే ఇలా ఒప్పంద అమలును అడ్డుకుంటున్నామని తేల్చి చెప్పింది. తజికిస్తాన్‌లోని ఐక్యరాజ్య సమితి (United Nations) గ్లేసియర్‌ల గురించి జరిగిన అంతర్జాతీయ సదస్సులో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పాకిస్తాన్ వ్యాఖ్యలను ఖండించారు. ‘ఈ వేదికకు సంబంధం లేని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం అనసవరం. ఉగ్రవాాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థానే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు.

1960 ఇండస్ వాటర్ ఒప్పందం పున:పరిశీలన చేయాలి

భారత్ 1960లో కుదిరిన ఇండస్ వాటర్ ఒప్పందాన్ని (Indus River Water Treaty) పున: పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని సాంకేతిక అభివృద్ధి, జనాభా, వాతావరణ మార్పులు, ముఖ్యంగా పాక్ ప్రేరిత సరిహద్దు ఉగ్రవాదాన్ని కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పాక్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత్‌ను నిందించడం మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ ఒప్పందాన్ని నిలిపివేయడం వెనక ఉన్న కారణం అందరికీ తెలిసిందేనని.. పుల్వామా దాడి తరహాలోనే ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పాక్‌ ఆధారిత ఉగ్రవాదులు 26 మంది భారత సాధారణ పౌరులను కాల్చి చంపారన్నారు. దీనికి వ్యతిరేకంగానే సింధు నది నీటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

Next Story