- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
K. Annamalai : మధురై సభ హేట్ స్పీచ్ ఎఫెక్ట్.. అన్నామలైపై కేసు నమోదు
మధురైలో ఇటీవల మురుగన్ భక్తుల సమావేశంలో హేట్ స్పీచ్ కు సంబంధించి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని గ్రూపుకు చెందిన ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది.

దిశ, నేషనల్ బ్యూరో: మధురైలో ఇటీవల మురుగన్ భక్తుల సమావేశంలో హేట్ స్పీచ్ కు సంబంధించి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని గ్రూపుకు చెందిన ఇద్దరు సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. జూన్ 22న జరిగిన మురుగన్ భక్తుల సమావేశంలో అనేక మంది నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని దీనిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు వంజినాథన్ అనే న్యాయవాది పేర్కొన్నారు. వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్నిపెంచేలా, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం వల్ల అన్నామలై, హిందూ మున్నాని రాష్ట్ర నాయకుడు కాదేశ్వర సుబ్రమణ్యం, మున్నాని కార్యకర్త సెల్వకుమార్‌పై కేసు నమోదైంది. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ , ఆంధ్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరైన ఈ కార్యక్రమంలో వివిధ వ్యక్తుల ప్రసంగాలు, తీర్మానాలు మత విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నానగర్ పోలీసులు బిఎన్‌ఎస్‌ఎస్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు మద్రాస్ హైకోర్టు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించారు.
అన్నామలైపై వివిధ కేసులు
అన్నామలై పై ఇప్పటికే వివిధ కేసులు ఉన్నాయి. డిసెంబర్ 2024లో ముందస్తు అనుమతి లేకుండా చెన్నైలో 'బ్లాక్ డే' ఊరేగింపు నిర్వహించినందుకు అన్నామలై 900 మందికి పైగా బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు అయింది. ఏప్రిల్ 2024లో లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అన్నామలైపై రెండు కేసులు నమోదు అయ్యాయి. గత లోక్ సభ ఎన్నికల సమయంలో మోడల్ ఆప్ ఎలక్షన్ కోడ్ కింద అనుమతించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రచారం నిర్వహించారనే ఆరోపణలతో ఆయనపై కేసులు నమోదు చేశారు.






