“మీ భార్యల భారతీయ చీరలను కాల్చండి”.. విపక్షానికి ప్రధాని సవాల్

by Dishanational4 |
“మీ భార్యల భారతీయ చీరలను కాల్చండి”.. విపక్షానికి ప్రధాని సవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో : భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలంటూ ప్రతిపక్షంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) బంగ్లాదేశ్‌లో “ఇండియా ఔట్‌” ఉద్యమాన్ని లేవనెత్తింది. దీనిపై అక్కడి సోషల్ మీడియాలోనూ జోరుగా విష ప్రచారం చేస్తోంది. బంగ్లాదేశ్ అంతర్గత రాజకీయాల్లో భారత జోక్యాన్ని వ్యతిరేకిస్తూ తాము ఈ ప్రచారాన్ని చేస్తున్నామని బీఎన్‌పీ అంటోంది. దీనిపై బీఎన్‌పీకి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ‘‘నిజంగా భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలనే తపనే బీఎన్‌పీ నాయకులకు ఉంటే.. వాళ్ల భార్యలు ధరించే భారతీయ చీరలన్నీ సేకరించి పార్టీ ఆఫీసుల ఎదుట తగలబెట్టాలి’’ అని ఆమె సవాల్ విసిరారు. ‘‘నిజంగానే ఇండియా ప్రోడక్ట్స్‌ను బహిష్కరించాలని బీఎన్‌పీ నేతలు భావిస్తే.. భారతీయ మసాలాలు లేకుండా వంటకాలు తినడం ప్రారంభించాలి. ఆ పని వాళ్ల చేయగలరా ? మసాలాలు లేకుండా వంటకాలు తినగలరా ?’’ అని షేక్ హసీనా ప్రశ్నాస్త్రాలు సంధించారు. ప్రధాని షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బీఎన్‌పీ సీనియర్ నేతలు.. ‘‘షేక్ హసీనా, ఆమెకు చెందిన రాజకీయ పార్టీ అవామీ లీగ్‌లు కూడా ఇండియా ప్రోడక్ట్ లాగే పనిచేస్తున్నాయి. ఆ రెండింటిని కూడా బాయ్‌కాట్ చేయాలి’’ అని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed