ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు పౌరసత్వాన్ని నిరూపించవు

by Phanindra |

ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు పౌరసత్వాన్ని నిరూపించవని బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు పౌరసత్వాన్ని నిరూపించవు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు సదరు వ వ్యక్తుల పౌరసత్వాన్ని నిరూపించవని, అవి కేవలం గుర్తింపు కార్డులేనని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్‌లో ప్రవేశించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబూ అబ్దుల్ రూఫ్ సర్దార్‌కు బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ అమిత్ బోర్కార్ ధర్మాసనం నిరాకరించింది. రాజ్యాంగంలోని సిటిజన్‌షిప్ చట్టం ప్రకారం మాత్రమే పౌరుల పౌరసత్వాన్ని నిర్ణయించగలమని, అంతేకానీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీలతో కాదని ధర్మాసనం పేర్కొంది.

ఈ కార్డులు గుర్తింపు కోసం, అలాగే ప్రభుత్వ సేవల లబ్ది పొందేందుక మాత్రమే ఉపయోగపడతాయని తెలిపింది. అబ్దుల్ సర్దార్ అక్రమంగా భారత్‌లో ప్రవేశించడమే కాకుండా ఆధార్, పాన్, ఓటర్, భారత పాస్ పోర్టు తదితర నకిలీ ధ్రువపత్రాలను కూడా పొందాడని పోలీసులు చెప్తున్నారు. అతనికి బెయిల్ ఇస్తే పారిపోయే ప్రమాదం ఉందన్న వారి వాదనతో కోర్టు కూడా ఏకీభవించింది. ‘పౌరసత్వాన్ని 1955 సిటిజన్‌షిప్ చట్టం ప్రకారమే నిర్ధారించాలి. కేవలం ఆధార్, పాన్, ఓటర్ ఐడీలు ఏంటే వాళ్లు భారత పౌరులు అయిపోరు’ అని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.

Next Story