- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bengaluru incident:బెంగళూరు తొక్కిసలాట ఘటనను బీజేపీ రాజకీయం చేస్తోంది
జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవటంపై బీజేపీ నాయకులు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తోంది. అయితే దీనిపై కాంగ్రెస్ నాయకులు రివర్స్ కౌంటర్ ఎటాక్ కు దిగారు.
బీజేపీ నాయకులు గతంలో రాజీనామా ఎందుకు చేయలే..
ఏఐసీసీ (AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఘటన అనుకోకుండా జరిగిందని కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదన్నారు. దీనికి ఇప్పటికే ప్రజలకు క్షమాపణలు చెప్పామని స్పష్టం చేశారు.గతంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఘోర ఘటనలను గుర్తు చేశారు. కుంభమేళాలో తొక్కిసలాటలో 30 మందికి పైగా చనిపోయారు. కొవిడ్ సమయంలో డెడ్ బాడీలు గంగా నదిలో తేలియాడటం చూశాం అప్పుడు ఎవరూ రాజీనామా చేశారు అని బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ బీజేపీ రాజకీయ ప్రయోజనాలతో ఆరోపణలు చేస్తోంది. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. కుంభమేళా, గోద్రా అల్లర్లు, వంటి పలు ఘటనలు జరిగిన సమయాల్లో బీజేపీ నుంచి ఏ నాయకుడు రాజీనామా చేశారని ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. బెంగళూరు తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని విచారణ నివేదిక అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని సిద్ధరామయ్య హామీ ఇచ్చారు.






