అమెరికాను మేము యుద్ధంలోకి లాగలేదు..నెతన్యాహు హాట్ కామెంట్స్

by velandi.Saikiran |   (  Updated:2026-03-20 03:47:24  IST  )

అమెరికాను తాము యుద్ధంలోకి లాగలేదని.. రెండు దేశాలు కలిసే ఇరాన్ ను టార్గెట్ చేశాయని నెతన్యాహు వివరణ ఇచ్చారు.

అమెరికాను మేము యుద్ధంలోకి లాగలేదు..నెతన్యాహు హాట్ కామెంట్స్
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇరాన్ తో భయంకరమైన యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ నాశనం అయిందని.. తాము గెలవబోతున్నట్లు కీలక ప్రకటన చేశారు. అందరూ అనుకున్న దాని కంటే ముందు తాము యుద్ధం ముగుస్తుందని స్పష్టం చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. అమెరికాను తాము యుద్ధంలోకి లాగలేదని.. రెండు దేశాలు కలిసే ఇరాన్ ను టార్గెట్ చేశాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ట్రంప్ ఏం చేయాలనేది ఆయనకు ఎవరైనా చెప్పగలరా ? ఆయన స్ట్రాటజీ చాలా స్పెషల్ అని ప్రశంసించారు. తాను బతికే ఉన్నానని మరోసారి చెబుతున్నా... దీనికి మీరే సాక్ష్యం అంటూ మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ఇకపై త‌న మ‌ర‌ణంపై తప్పుడు ప్రచారాలు ఆపాలని కోరారు.

Benjamin Netanyahu: డొనాల్డ్ ట్రంప్ కీలక రిక్వెస్ట్.. నెతన్యాహు సంచలన ప్రకటన

Next Story