- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిడ్నీలో దారుణం.. 17 ఏళ్ల బాలికపై 6 గంటల పాటు సామూహిక అత్యాచారం
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల టీనేజ్ బాలికపై కామాంధులు 6 గంటలపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కలకలం రేపిన దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగుచూసింది.17 ఏళ్ల టీనేజ్ బాలికపై నలుగురు కామాంధులు ఆరు గంటలపాటు వాహనంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన 2024 డిసెంబర్ 15న జరిగింది. ఈ ఘటనలో నిందితులను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..
బాధితురాలు క్రిస్టమస్ షాపింగ్ కోసం లివర్‌పూల్‌లోని వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్‌కి వెళ్లిన సమయంలో ఓ 16 ఏళ్ల బాలుడు ఆమెను ఓ పార్కుకి డ్రైవ్ చేయమని కోరాడు. అక్కడ కారులోకి ఇద్దరు యువకులు ఎక్కి అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత మరో యువకుడు చేరి, ఈ దారుణంలో భాగస్వామయ్యాడు. దాదాపు ఆరు గంటల పాటు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా దారుణంగా, ఈ క్షణాలను ఫోన్‌లో వీడియో తీశారు. బాధితురాలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు పురోగమించింది. సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ ఆధారాలు, బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను ఏడు నెలల తర్వాత అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో 19 ఏళ్ల ఆదమ్ అబ్దుల్ హమీద్, 18 ఏళ్ల యువకుడు, 16, 14 ఏళ్ల ఇద్దరు బాలురు ఉన్నారు. వీరిపై అనేక సెక్స్ దాడుల, శారీరక వేధింపుల కేసులు నమోదయ్యాయి.
నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. నిందితులు సమాజానికి ప్రమాదకరమని, వారిని విడుదల చేస్తే మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేస్తూ బెయిల్‌ను నిరాకరించారు. ఇక ఈ కేసు తదుపరి విచారణలో 19 ఏళ్ల అబ్దుల్ హమీద్ కేసు ఆగస్టు 13న, మిగిలిన ముగ్గురు యువకుల కేసులు ఆగస్టు 11న విచారణకు రానున్నాయి. 16, 14 ఏళ్ల బాలుర కేసులు ప్రత్యేకంగా చిల్డ్రన్స్ కోర్టులో కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలన్న సమాజ అభిలాషపై పలు హ్యూమన్ రైట్స్ సంఘాలు, మహిళా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి.






