Indonesia Earthquake: 46 మంది మృతి

by Hajipasha |   (  Updated:2022-11-21 11:20:26  IST  )

ఇండోనేషియా ప్రధాన ఐలాండ్ జావాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది.

Indonesia Earthquake: 46 మంది మృతి
X

జకార్తా: ఇండోనేషియా ప్రధాన ఐలాండ్ జావాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 46 మంది మరణించగా, సుమారు 700 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. భూకంప తీవ్రతకు పెద్ద ఎత్తున భవంతులు ధ్వంసమై, తీవ్ర నష్టాన్ని మిగిల్చాయని చెప్పారు. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. క్షతగాత్రులకు అక్కడిక్కడే చికిత్స అందించేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. కాగా, రిక్టారు స్కేల్‌పై భూకంప తీవ్రత 5.6 మ్యాగ్నిట్యూడ్‌ నమోదైంది. నష్టం భారీగానే సంభవించిందని సియాంజూర్ అధికారి హెర్మాన్ సుహర్మెన్ తెలిపారు. మరోవైపు మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

పశ్చిమ జావాలోని సియాంజుర్ ప్రాంతంలో భూకంపం 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. రాజధాని జకర్తాకు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపారు. అయితే ఆందోళనకు గురైన నివాసితులు విధుల్లోకి పరుగులు తీశారని తెలిపింది. జకర్తాలోనూ కంపనాలు వచ్చాయని, జనం ఇళ్లను వీడారని తెలిపారు. అయితే ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని నివేదికలు పేర్కొన్నాయి. గతేడాది సులవెసీ ద్వీపంలో భూకంపం ధాటికి 100 మందికి పైగా మరణించగా, వేల మంది నిరాశ్రయులయ్యారు.

Next Story