WHO నుంచి నిష్క్రమించిన అమెరికా.. కోవిడ్‌ను కంట్రోల్ చేయడంలో విఫలమైందని వ్యాఖ్య

by Naga Rani Yarlagadda |

గ్రీన్ ల్యాండ్ పై ఆధిపత్యం సాధించాలని ట్రై చేస్తున్న అమెరికా.. డబ్ల్యూహెచ్ఓలో కొనసాగడంపై కీలక నిర్ణయం తీసుకుంది.

WHO నుంచి నిష్క్రమించిన అమెరికా.. కోవిడ్‌ను కంట్రోల్ చేయడంలో విఫలమైందని వ్యాఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: గ్రీన్ ల్యాండ్ పై ఆధిపత్యం సాధించాలని ట్రై చేస్తున్న అమెరికా.. డబ్ల్యూహెచ్ఓలో కొనసాగడంపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి అధికారికంగా నిష్క్రమించింది. కోవిడ్ ను కంట్రోల్ చేయడంలో, అందుకు సంబంధించిన సంస్కరణలను అమలు చేయడంలో WHO విఫలమైందని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఇకపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు అమెరికా నుంచి వెళ్లే అన్నిరకాల నిధులను వెంటనే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా WHO ఆఫీసుల్లో పనిచేస్తున్న యూఎస్ సిబ్బందిని వెనక్కి పిలిపించినట్లు తెలిపింది. WHOకు చెందిన టెక్నికల్ కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇకపై ప్రపంచ ఆరోగ్యసంస్థతో పరిమిత పరిధి మేరకే పనిచేయనున్నట్లు అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. కాగా.. డబ్ల్యూహెచ్ఓ నుంచి నిష్క్రమించే సమయానికి.. అమెరికా ఆ సంస్థకు 260 మిలియన్ డాలర్లు (రూ.2382 కోట్లు) బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదికలు వెల్లడించాయి.

Next Story