బ్రా ధరించలేదని మహిళను విమానం ఎక్కనివ్వని ఫ్లైట్ సిబ్బంది

by Disha Web Desk |
బ్రా ధరించలేదని మహిళను విమానం ఎక్కనివ్వని  ఫ్లైట్ సిబ్బంది
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్రా ధరించలేదని ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది అమర్యాదగా మాట్లాడారు. అంతే కాదు.. ఫ్లైట్ కూడా ఎక్కవద్దని అడ్డుకున్నారు. ఇది జనవరిలో జరిగినా ఎయిర్ పోర్ట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆ మహిళ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకోని బాధపడింది. విమాన సిబ్బంది చేష్టలతో తీవ్ర అవమానానికి గురైన ఆమె లాస్ ఏంజెలెస్‌లో మీడియా ముఖంగా ఆ వివరాలను వెల్లడించింది. ఇంతకూ ఆమె ఏం చెప్పిందంటే..

అమెరికాకు చెందిన లిసా ఆరో బోల్డ్ (38) సాల్ట్ లేక్ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లడానికి ఎయిర్ పోర్ట్‌కు వెళ్లింది. ఆ సమయంలో ఆమె బ్యాగీ జీన్స్, వదులుగా ఉన్న వైట్ టీషర్ట్ ధరించింది. కానీ బ్రా వేసుకోలేదని తెలిపింది. అయితే ఎయిర్ పోర్ట్‌లో ఫ్లైట్ సిబ్బంది తనతో అమర్యాదగా మాట్లాడి అవమానపరిచారని చెప్పింది. బ్రా వేసుకోనప్పటికీ తన ఎద బయటకు కనిపించలేదని కానీ మీ వస్త్రధారణ బహిర్గతంగా, ఆక్షేపణీయంగా ఉందని, మీ ఎద బయటకు కనిపించకుండా కవర్ చేసుకోండని, లేకపోతే విమానం ఎక్కడానికి అనుమతించబోమని సిబ్బంది అడ్డుకున్నారని వాపోయింది. ఫ్లైట్ సిబ్బంది ప్రవర్తన తనకు తీవ్ర అవమానంగా అనిపించిందని ఆవేధన వ్యక్తం చేసింది. టీ షర్ట్‌పై జాకెట్ ధరిస్తేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పడంతో ఫ్లైట్ సిబ్బందితో తాను గొవడకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. మహిళా ప్రయాణికులపై చూపిన ఈ వివక్షాపూరిత వైఖరిపై చర్చించేందుకు ఎయిర్ లైన్స్ కంపెనీ ప్రెసిడెంట్ సమావేశానికి రావాలని తన న్యాయవాది గ్లోరియా ఆల్ఫ్రెడ్ లేఖ రాయడంతో దిగొచ్చిన యాజమాన్యం.. తనకు క్షమాపణ చెప్పినట్లు లిసా ఆరో బోల్డ్‌ తెలిపింది.


Next Story

Most Viewed