- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Air-to-Air Combat టెహ్రాన్‌లో గగనతల యుద్ధం : ఇరాన్ జెట్‌ను కూల్చివేసిన ఇజ్రాయెల్ F-35
ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో బుధవారం జరిగిన పెను పోరులో ఇరాన్‌కు చెందిన రష్యా తయారీ యాక్-130 (Yak-130) యుద్ధ విమానాన్ని ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్ కూల్చివేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్ రాజధాని టెహ్రాన్ గగనతలంలో బుధవారం జరిగిన పెను పోరులో ఇరాన్‌కు చెందిన రష్యా తయారీ యాక్-130 (Yak-130) యుద్ధ విమానాన్ని ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-35 (F-35) ఫైటర్ జెట్ కూల్చివేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన ఐదు రోజుల్లోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకుందని ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) వెల్లడించింది.
చరిత్ర సృష్టించిన ఎఫ్-35
ఈ కూల్చివేత ప్రపంచ సైనిక చరిత్రలో అత్యంత కీలకంగా మారింది. ఎఫ్-35 యుద్ధ విమానం ఒక మానవ సహిత శత్రు విమానాన్ని గగనతలంలో కూల్చివేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా, గత 40 ఏళ్లలో ఇజ్రాయెల్ వైమానిక దళం నేరుగా మరొక దేశ విమానంతో గగనతల పోరులో (Air-to-Air Combat) పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి అని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ముదురుతున్న యుద్ధం.. భారీ ప్రాణనష్టం
గత వారం అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ నిరంతరం ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. అలాగే టెహ్రాన్‌లోని భద్రతా దళాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. క్వామ్ (Qom) నగరంలోని మతగురువుల మండలి కార్యాలయాన్ని, అలాగే టెహ్రాన్‌లోని 'బాసిజ్' (Basij) పారామిలిటరీ దళాల భవనాలను ఇజ్రాయెల్ క్షిపణులు ధ్వంసం చేసినట్లు సమాచారం. ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్‌లో ఇప్పటి వరకు సుమారు 1000 మంది మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం టెహ్రాన్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ తన దాడులను మరింత ఉధృతం చేస్తుండటంతో అంతర్జాతీయ సమాజంలో ఆందోళన నెలకొంది.






