- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
28 ఏళ్లకే 9 మందికి జన్మనిచ్చిన మహిళ.. ఏక్కడో తెలుసా?
by Sathputhe Rajesh |
28 ఏళ్లకే ఓ మహిళ తొమ్మిది మందికి జన్మనిచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: 28 ఏళ్లకే ఓ మహిళ తొమ్మిది మందికి జన్మనిచ్చింది. అమెరికాలోని నెవాడా స్టేట్ కు చెందిన 39 ఏళ్ల కోరా డ్యూక్ 2001లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి గర్భం దాల్చింది. 2012లో చివరిసారిగా బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తన భర్త ఆండ్రే డ్యూక్ తో పాటు 8 మంది సంతానంతో కలిసి నివసిస్తోంది. వీరికి పుట్టిన మూడో సంతానం ఏడు రోజులకే కన్నుమూసింది.
ఇటీవల తన పిల్లలతో కోరా చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లలను వయసుల వారీగా నిల్చోబెట్టి వారిని పరిచయం చేస్తూ తీసిన ఆ వీడియో నెటిజన్లను ఆకర్షించింది. అయితే ఇంత మందిని కావాలని కనలేదని.. కుటుంబ నియంత్రణ పద్ధతులు విఫలం కావడం వల్లే ఇన్ని సార్లు గర్భం దాల్చినట్లు కోరా తెలిపారు. తొమ్మిదో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నట్లు కోరా తెలిపారు.
Next Story






