రష్యాను వదలని వరుస భూకంపాలు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-05 03:16:54  IST  )

రష్యాను వరుస భూకంపాలు వదలటం లేదు.

రష్యాను వదలని వరుస భూకంపాలు
X

దిశ, వెబ్ డెస్క్: రష్యాను (Russia) వరుస భూకంపాలు (Earthquake) వదలటం లేదు. గత వారం రోజుల వ్యవధిలోనే మూడుసార్లు భూప్రకంపనాలు సంభవించాయి. తాజాగా కామ్చాట్కా తీరంలో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదయింది. భూకంపం ధాటికి పలు నగరాల్లోని భవనాలు, ఇళ్లు తీవ్రంగా కంపించటంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ వరుస భూకంపాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్‌లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశమున్నట్టు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా, జులై 30న కామ్చాట్కా దీవుల్లో రిక్టర్ స్కేల్‌పై 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో పసిఫిక్ తీరంలో అధికారులు సునామీ హెచ్చరికలు సైతం జారీ చేశారు. పసిఫిక్‌ ప్రాంతంలో 2011 తర్వాత ఇదే అత్యంత భారీ భూకంపమని నిపుణులు పేర్కొన్నారు. అలాగే, ఆగస్టు 3న 7.0 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం కావడం గమనార్హం. ఈ ప్రకంపనలతో కామ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న క్రాషెన్నీనికోవ్‌ అగ్నిపర్వతం 600 ఏండ్ల తర్వాత తొలిసారిగా విస్పోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం 6 వేల మీటర్ల ఎత్తుకు బూడిదను గాలిలోకి విడుదల చేసింది. దీంతో ఆరెంజ్‌ హెచ్చరికను జారీ చేశారు.

Next Story