అమ్మమ్మను తుపాకీతో కాల్చిన 6 ఏళ్ల బాలిక

by S Gopi |

తన అమ్మమ్మను ఓ ఆరేళ్ల బాలిక తుపాకీతో కాల్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి... 6 year old girl shoots grandmother from backseat of car

అమ్మమ్మను తుపాకీతో కాల్చిన 6 ఏళ్ల బాలిక
X

దిశ, వెబ్ డెస్క్: తన అమ్మమ్మను ఓ ఆరేళ్ల బాలిక తుపాకీతో కాల్చిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం ప్రకారం... అమెరికాలోని ఫ్లోరిడాలో కదులుతున్న ఓ కారులో వెనుక సీటులో ఉన్న ఆరేళ్ల బాలిక ఆ సీటు వెనుకాలో ఉన్న జేబులో ఉన్న తుపాకీని తీసుకుని ముందువైపు కూర్చున్న తన అమ్మమ్మను కాల్చింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. విచారణ చేసిన పోలీసులు కాల్పులు ప్రమాదవశాత్తు జరిగినట్లు పేర్కొన్నారు. ఆయుధాలు కలిగి ఉన్న వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని, వాటిని ఎక్కడపడితే అలా ఉంచకుండా జాగ్రత్తగా, సేఫ్ గా పెట్టాలని సూచనలు చేశారు.

Next Story