- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44కి చేరిన మృతుల సంఖ్య
హాంకాంగ్ నగరంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని అనేక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: హాంకాంగ్ నగరంలోని ఓ హౌసింగ్ కాంప్లెక్స్‌లోని అనేక బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లలో భారీ అగ్నిప్రమాదం (Massive fire) చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున ఎగిసి పడుతున్న మంటలు పక్క అపార్ట్మెంట్లకు పడుతుండటంతో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది. వందల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ అగ్ని ప్రమాదంలో 44 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే మరో 270 మంది మిస్సింగ్ అయినట్లు తెలుస్తుంది.
నిన్న సాయంత్రం సమయంలో మంటలు అంటుకోవడంతో ఆ అపార్టుమెంట్లలో ఉండే 4000 లకు పైగా నివాసితులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ విషాదకర ఘటనతో హౌసింగ్ కాంప్లెక్స్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రికి రాత్రే దాదాపు 700 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, తాత్కాలిక ఆశ్రయాలలో ఉంచారు. గల్లంతైన వారి కోసం అగ్నిమాపక, రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. ఈ హృదయ విదారక ఘటన మృతుల కుటుంబాలకు, ఆచూకీ తెలియని వారి బంధువులకు తీరని శోకాన్ని మిగిల్చింది. కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.






