- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్‌తో యుద్ధం కోసం రూ.18 లక్షల కోట్లు కావాల్సిందే!
ఇరాన్ తో యుద్ధం చేసేందుకు గాను మరో రూ. 18 లక్షల కోట్లు కావాలని వైట్ హౌజ్ ను పెంటగాన్ కోరినట్లు కథనాలు వస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ ను ఓడించేందుకు ఇజ్రాయెల్, అమెరికా చాలా కష్టపడాల్సి వస్తోంది. దాదాపు 19 రోజులుగా ఈ మూడు దేశాల మధ్య యుద్ధం భయంకరంగా కొనసాగుతోంది. ఇరాన్ కు సంబంధించిన అగ్ర నేతలు మరణించినప్పటికీ కూడా వాళ్ళు తగ్గడం లేదు. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఒత్తిడి పెంచుతూనే ఉంది. అటు ఇరాన్ పై యుద్ధం చేసేందుకు అమెరికా కోట్లలో ఖర్చుపెడుతోంది. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల విలువైన ఆయుధాలను వినియోగించింది అమెరికా. ఇక ఇరాన్ ను మట్టి కరిపించేందుకు ఆ రానున్న రోజుల్లో మరికొన్ని నిధులు కావాలంటూ పెంటగాన్ ( అమెరికా రక్షణ శాఖ) కోరినట్లు తెలుస్తోంది.
ఇరాన్ తో యుద్ధం చేసేందుకు గాను మరో రూ. 18 లక్షల కోట్లు కావాలని వైట్ హౌజ్ ను పెంటగాన్ కోరినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ భారీ మొత్తం ఇరాన్ ఎకానమీలో సగం కంటే ఎక్కువ కావడం విశేషం. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే 11 డాలర్ల బిలియన్లు ఖర్చు చేసింది అమెరికా. ఇక ఇప్పుడు మరో రూ.18 లక్షల కోట్లు కావాలని కోరుతోంది. అయితే దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ట్రోలో కూడా చేశారు. తమను ఓడించేందుకు అమెరికా ఎకనామిని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహుకు అమెరికన్లు స్పెషల్ థాంక్స్ చెప్పాలంటూ ఎద్దేవా చేశారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ.






